సచివాలయాల ద్వారా ప్రజలకు మరింతచేరువగా పారదర్శక పాలన…
గ్రామాల అభివృద్దే జగనన్న లక్ష్యం…
రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామ సచివాలయ భవన ప్రారంభ కార్యక్రమంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
రాయచోటి ముచ్చట్లు:
గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలంలోని కాటిమాయ కుంట గ్రామ సచివాలయ నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు రాష్ట్రాభివృద్ధికి ప్రమాణికాలుగా నిలిచాయన్నారు. ప్రతిగ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ , వాలంటీర్ వ్యవస్థ ప్రజల ముంగిటకే పారదర్శకంగా సేవలు అందిస్తోందన్నారు.మన రాష్ట్రంలో అమలవుచున్న సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.కాటిమాయకుంటలో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా,విలేజ్ క్లినిక్ ల సముదాయం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు.
కాటిమాయకుంట హరిజన వాడలో రామాలయం నిర్మాణపుపూజలలో ఎంఎల్ఏశ్రీకాంత్ రెడ్డి కాటిమాయకుంట హరిజనవాడ ప్రజలతో శ్రీకాంత్ రెడ్డి మమేకమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు.ప్రభుత్వం అందిస్తున్న పథాకాలను వివరించి ,ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగారామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లయ్స్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ ఖాదర్ వలీ, రమణా రెడ్డి,శంకర్ రెడ్డి,కౌన్సిలర్ కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి,బాబు,జుల్ ఫకీర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags:CM Jagan is working to establish Gram Swarajya…