ప్రధానితో సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.   పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.2900 కోట్లు ఖర్చు చేశాము. వీటిని రీయింబర్స్ చేయాలని మోదీని సీఎం జగన్ కోరారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. ఇప్పటి వరకు చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ కింద ఏపీకి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని  కోరారు. రాష్ట్రానికి  ప్రత్యేక హోదాతోపాటు హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు.   ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.

 

Tags: CM Jagan met the Prime Minister

Leave A Reply

Your email address will not be published.