Natyam ad

ఏషియన్‌ గేమ్స్ విజేత‌ల‌ను ప్రశంసించిన సీఎం జగన్, వారికి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని హామీ

తాడేపల్లి ముచ్చట్లు:

నగదు పురస్కారంతో పాటు ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ. 4.29కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు గెలుపొందిన ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి సీఎం జగన్‌ను నేడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు.ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం విడదలు చేసింది.

Post Midle

ఏషియన్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. వారి పతకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం విడదుల చేసని నగదు వివరాలు:

1. వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్‌ జిల్లా, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 90 లక్షలు.
2. ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 50 లక్షలు.
3. బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 30 లక్షలు.
4. మైనేని సాకేత్‌ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
5. యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
6. బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
7. కోనేరు హంపి, ఎన్టీఆర్‌ జిల్లా, చెస్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
8. కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.

ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ. 4. 29 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ ఎండీ హెచ్‌.ఎం.ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ.

Tags: CM Jagan praised the winners of the Asian Games and promised to provide them with world-class facilities

Post Midle