రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:
 
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం నాడు తన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా విడుదల చేసిన మూడో విడతలో భాగంగా 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ. 2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేసింది. గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్ఓఎఫ్ఆర్, కౌలుదారులకు రూ. 2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు జమ చేసింది. కొత్తగా సాగు హక్కు పత్రాలు పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.ఏటా ప్రభుత్వం.. రూ. 13వేల 500 అందిస్తోంది. తొలివిడతగా పంట వేసేముందు మే నెలలో 7వేల500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడుతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందిస్తోంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: CM Jagan released the Farmer Assurance Fund

Natyam ad