విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖకు సంభందించి  రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ అమెరికా నుంచి పాల్గొన్నారు.
ఎంఓయూ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుంది. ఈ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం కావడం అన్నది చాలా గొప్ప ఆలోచన. మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం అన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమని అన్నారు.

 

 

Post Midle

పదోతరగతిలో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడున్న మా అందరి కలలు సాకారం కావడానికి బైజూస్ భాగసామ్యం గొప్ప బలాన్నిస్తుంది. బైజూస్ ద్వారా అందే నాణ్యమైన కంటెంట్, పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్ ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. విద్యారంగంలో ఇదొక మేలిమలుపు, ఇది ఒక గేమ్ ఛేంజర్. పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్లలో, ఏడాదికి రూ.20వేల నుంచి 24వేల వరకూ చెల్లించి సబ్స్క్రైబ్చేసుకుంటే లభించని బైజూస్ కంటెంట్ ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు.. తమ 10వ తరగతి పరీక్షలను సీబీఎస్నమూనాలో రాస్తారు. వీరిని ముందుండి నడిపించడానికి ట్యాబ్లు కూడా ఇస్తాం. డిజిటల్ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం. అన్నీకూడా పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల వీళ్లు తమ పదోతరగతి సీబీఎస్ పరీక్షలను సులభంగా ఎదుర్కొంటారు. టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుంది. తమ బోధనను మరింత నాణ్యంగా అందించగలరని అన్నారు.ట్యాబ్లకోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నాం. బైజస్ నుంచి అందుతున్న భాగస్వామ్యం చాలా అమూల్యమైనది. విద్యా రంగ వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్ సీఈఓ రవీంద్రన్ లాంటివారు ముందుకు రావడం శుభ పరిణామమని సీఎం అన్నారు.

 

Tags: CM Jagan review on education

Post Midle
Natyam ad