చెన్నె కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటన

అమరావతి ముచ్చట్లు:


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటిస్తారు. 2021 ఖరీఫ్కు సంబంధించిన పంటల బీమా పరిహారంను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 09.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముఖాముఖి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్ను రైతులకు అందజేసి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి పయనమై, 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

 

Tags: CM Jagan visits Chennai Kottapalli