దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం సీఎం జగన్
మచిలీపట్నం ముచ్చట్లు:
రాజధాని పేరుతో గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలని చంద్రబాబుతో పాటు గజ దొంగల ముఠా అనుకుందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదలకు ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని మండిపడ్డారు. ఈ రోజు మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26న పంపిణీ చేస్తామని ప్రకటించారు.
పేదలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన మాటల్లోనే పలుమార్లు బయటపడిందన్నారు. ‘‘ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీల తోక కత్తిరిస్తా అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని మహిళల్ని అవమానించారు. ఇంగ్లీష్ మీడియం వద్దని, రకరకాలుగా దుష్ప్రచారం చేశారు’’ అని ఆరోపించారు.

‘‘చంద్రబాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అక్కడ పేదలు కేవలం పాచి పనులు చేయాలంట. కార్మికులుగానే ఉండాలంట. వాళ్లకు అక్కడ ఇళ్లు ఉండకూడదట. అమరావతిలోకి వీళ్లు పొద్దున్నే రావాలట.. పనులు చేసి తిరిగి వెళ్లిపోవాలట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం’’ అని జగన్ చెప్పారు.‘‘చంద్రబాబు హయంలో ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా, వైసీపీ ఇస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్టు కేసులు వేయించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. పెత్తందారీ భావజాలానికి చంద్రబాబు ప్రతీక’’ అని జగన్ ఆరోపించారు.
Tags:CM Jagan, we are fighting against monsters with a cruel mentality
