Natyam ad

ప్రజలకు ఎంతో ముఖ్యమైన వైద్యాన్ని దగ్గర చేశాం -సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న నీటి ఆయోగ్ మీటింగ్ లో రాష్ట్రము తరపున ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు..కాగా  జరిగిన నీటి ఆయోగ్ మీటింగ్ లో జగన్ రాష్ట్ర ప్రజలకు వైద్యం విషయంలో చేసిన కార్యక్రమాలను వివరించాడు. అందులో ముఖ్యంగా ఇటీవల ప్రజారోగ్యం మరియు పౌష్టికాహారం లో భాగంగా వీటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రాష్ట్రంలో 10592 గ్రామ మరియు వార్డ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని జగన్ ఈ మీటింగ్ లో చెప్పారు. ఈ రోజుల్లో ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వైద్యం కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారని.. కొన్ని సార్లు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చాలా సందర్భాలు ఉన్నాయని సవివరంగా చెప్పారు.ఇక గత రెండు సంవత్సరాలలో మొత్తం 48639 వైద్య సిబ్బందిని భర్తీ చేశామన్నారు. ఇప్పుడు వైద్యం ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.

 

Post Midle

Tags; CM Jagan: We have brought very important medicine to the people!

Post Midle