CM Jagan, who has given recognition to BCs, cannot repay the debt

బీసీలకు గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్‌ రుణంతీర్చుకోలేం

– నాగభూషణం

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

దేశ చరిత్రలో ఎక్కడ లేనివిధంగా బీసీలను గుర్తించి, కులాల వారీగా 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేమని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , బీసీ సంఘ నాయకుడు కొండవీటి నాగభూషణం అన్నారు. బుధవారం పట్టణంలోని నాయిబ్రాహ్మణుల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బడుగుబలహీన వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి, వారిని అభివృద్ధి చేశారని కొనియాడారు. బీసీలు ఐకమత్యంతో వైఎస్‌ఆర్‌సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధీన్‌షరీఫ్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ నాయకులు అమ్ము, కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలి, రాజు తదితరులు పాల్గొన్నారు.

మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ఉత్తర్వులు

Tags: CM Jagan, who has given recognition to BCs, cannot repay the debt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *