Natyam ad

నగదు బదిలీలుచేసిన సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:


అర్హులై ఉండి ఏ కారణంచేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేసారాయన. ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైయస్సార్ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్పుట్సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, వైయస్సార్ కాపునేస్తం, వైయస్సార్ వాహనమిత్ర, వైయస్సార్ నేతన్న నేస్తం పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, బీసీసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హేండ్లూమ్స్ అండ్ టెక్ట్స్టైల్స్ ముఖ్యకార్యదర్శి కె సునీత, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు..

 

Tags: CM Jagan who transferred money

Post Midle
Post Midle