108, 104 launched by CM pics

సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయి

Date:01/07/2020

విజయవాడ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 104, 108 అంబులెన్స్ వైద్య సేవలను ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను జగన్ ప్రారంభించారు. జెండా ఊపి మొత్తం 1,088 అంబులెన్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమం తరువాత ఈ అంబులెన్సు వాహనాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తరలించారు. ఇందులో 676 కొత్త 104 వాహనాలు, 412 108 వాహనాలు ఉన్నాయి. విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. అంబులెన్స్ ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. చిన్నారులు, గర్భిణీల కోసం కూడా ప్రత్యేకంగా నియో నాటల్ అంబులెన్సులు ప్రారంభించారు. ఇకపై ప్రతి మండలంలో ఒక 108, ఒక 104 అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

 

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పుడు మరింతగా విస్తరించామని, 95 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భద్రతపై భరోసాను కల్పించామని అన్నారు. ఈ అంబులెన్స్ ల ద్వారా 108, 104 సేవలు ప్రతి ఒక్కరికీ దగ్గరవుతాయని తెలిపారు. 412 అంబులెన్స్ లు 108 సేవల్లో భాగంగా అనారోగ్యానికి గురైన వారిని, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరుస్తాయని, మరో 412 అంబులెన్స్ లలో 282 అంబులెన్స్ లు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను కలిగివుంటాయని అన్నారు. మిగతావి అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్టుతో ఉంటాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

అనుమతి లేని లేఔట్లతో మోసపోవద్దు

Tags:CM Jaganmohan Reddy’s name is a long history in the state of Andhra Pradesh

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *