సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కెసిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా సూచనల మేరకు నూతనంగా మంజూరైన వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తుండడంతో ఆదర్శ సీఎంగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని కొనియాడారు. ఎన్నికల మునుపు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా గుర్తించి మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. అధికారం చేపట్టిన అనతి కాల వ్యవధిలోనే 97 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు.

సచివాలయంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలను వాలింటర్ల ద్వారా నేరుగా ఇంటికే అందుస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదిస్తేనే వచ్చెదన్నారు. ప్రస్తుత పాలనలో సంక్షేమ పథకాలు మంజూరు చేయడంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం వివిధ రకాల 30 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు ప్రజలు వినతులు చేస్తే, వాలింటర్లు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తెలియజేసి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వాలింటర్లు మేఘన, రేవతి, రెడ్డెమ్మ, శ్రావణి, దినకర్, కుమారస్వామి, ప్రదీప్, హరీష్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags: CM Jagan’s focus is welfare – Sarpanch Srinivasulu Reddy
