నిరుపేదల అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం

CM Jagan's mission is to promote poverty

CM Jagan's mission is to promote poverty

– మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా

Date:12/11/2019

రామసముద్రం ముచ్చట్లు:

నిరుపేదల అభివృద్దే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయంగా పని చేస్తున్నారని మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాషా అన్నారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నవాజ్ భాషాకు నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘమిత్రలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవ వేతనం రూ.10వేలుకు పెంచడంతో ఏపీఎం నీరజ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవాజ్ భాషాకు పుష్ప గుచ్చాన్ని అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షిరాభిషేకం నిర్వహించి మహిళల పక్షపాతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ముఖ్యంగా వలింటిరీలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. అంతేకాకుండా వలింటిరీలు అవకతవకలకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. మీకు కూడా త్వరలోనే రూ.5వేలు నుంచి రూ.8వేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెంచుతారని హామీ ఇచ్చారు. అనంతరం శాఖల వారిగా అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఎంపీడీఓ లక్ష్మీపతి, ఎస్ఐ పరుశురాముడు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

జయలలిత బయోపిక్‌ను వెండితెర కెక్కించేందుకు ప్రయత్నం

 

Tags:CM Jagan’s mission is to promote poverty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *