అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళులు
అమరావతి ముచ్చట్లు:
క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం వైయస్.జగన్ మెహన్ రెడ్డి పాల్గోన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ఆర్ కె రోజా, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, సాంస్కృతిక పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.

Tags: CM Jagan’s Tribute to Immortal Potti Sri Ramulu
