Natyam ad

నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..

ప్రకాశం ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.15 గంటలకు ఒంగోలు అగ్రహారం దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. పది నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు.. ఆ తర్వాత అక్కడ నుంచి అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఇంటి స్థలాల లేఔట్ పైలాన్ దగ్గరకు చేరుకుంటారు.. ఇక, ఉదయం 10. 40 గంటలకు సభావేదికకు చేరుకుంటారు.. 10.45 గంటలకు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, 10. 50 గంటల నుంచి 11 గంటల వరకు స్టాల్స్ ను సీఎం జగన్ పరిశీలిస్తారు.ఇక, ఆ తరువాత 11.05 గంటలకు సభా వేదికపైకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకుంటారు.. 11.25 గంటల నుంచి 11.35 గంటల వరకు లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు గంట పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.40 గంటలకు వేదిక వద్ద నుంచి బయల్దేరి 12.45 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. గంట పాటు స్థానిక నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అలాగే, మధ్యాహ్నం 1. 50 గంటలకు హెలి కాప్టర్లో బయల్దేరి మ. 2.25 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

 

Post Midle

Tags:CM Jagan’s visit to Ongole today.. Distribution of house tracks to the poor..

Post Midle