Natyam ad

పి గన్నవరంలో సీఎం జగన్ పర్యటన

కోనసీమ ముచ్చట్లు:


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమలో గోదావరి వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. పెదపూడిలో వర్షంలోనే వరద బాధితుల వద్దకు వెళ్లారు. పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్లిన సీఎం గోదావరి వరద బాధితులను పరామర్శించారు.వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాల గురించి నేరుగా బాధితులనే అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదపూడి ఫెర్రీ నుంచి పంటుపై లంక గ్రామాలకు చేరుకున్న సీఎం వరద బాధితులను కలిసి వారిని పరామర్శించారు. వర్షం వల్ల రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో సీఎం జగన్ ట్రాక్టర్ పై కొన్ని గ్రామాల్లోకి వెళ్లారు. ప్రభుత్వ సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులను అక్కడ అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

Tags: CM Jagan’s visit to P Gannavaram

Post Midle
Post Midle