మహిళల సంక్షేమమే సీఎం జగన్ ఆకాంక్ష
కాకినాడ ముచ్చట్లు:
మహిళల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతవిశ్వనాద్ పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్‌ఎన్ చార్టీస్ సమీపంలోని పైడా గ్రౌండ్స్‌లో 25.32 కోట్ల వైఎస్సార్ ఆసరా మెగా చెక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఏడీసీ సీహెచ్ నాగనరసింహారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రిపద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగామూడవ విడత రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు.

అంతకు ముందు నాయకులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. రాజకీయ ప్రాధాన్యత నుంచి అన్ని ప్రభుత్వ పథకాలను మహిళలకే చెందేలా సీఎం తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించే పాలకులు ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. 25 ఏళ్ళు అధికారం కొనసాగించిన ప్రభుత్వాలు కూడా చేయలేని సంస్కరణలను ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు హామీ ఇచ్చి మహిళలను మోసం చేశారన్నారు. సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా మూడు విడతలుగా వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నారన్నారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడడం ముఖ్యమని, అటువంటి నైజం కలిగిన సీఎంను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి కోరారు.
Tags;
