చింతమడకలో ఓటు హక్కుని వినియోగించుకున్నసిఎం కెసిఆర్

చింతమడకలో ఓటు హక్కుని వినియోగించుకున్నసిఎం కెసిఆర్

చింతమడక  ముచ్చట్లు:

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికలు-2023లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ దంపతులు కూడా ఓటు వేశారు. ఇక మంత్రి హరీశ్ రావు దంపతులు కూడా సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.మరోవైపు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా వెళ్లి కొడంగల్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ సౌత్ వింగ్ పోలింగ్ బూత్‌లో (బూత్ నెం.237) ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కుట్రలకు లొంగిపోవద్దని తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Tags: CM KCR exercised his right to vote in Chintamadaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *