ముస్లింల పై సీఎం కేసీఆర్ కపట ప్రేమ

ముస్లింలకు 12%శాతం రిజర్వేషన్లు గాలికి
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా

కోరుట్ల ముచ్చట్లు :

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముస్లిం మైనార్టీలకు 12%శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని మెట్ పల్లి ముస్లిం మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ముస్లిం మైనారిటీ లకు ఇచ్చిన హామీ మరిచి ,వారికి సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. 12% శాతం రిజర్వేషన్ల పై ముస్లిం మైనార్టీలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కేవలం ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే వాడుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముస్లిం మైనార్టీలకు అవసరమైన 12% శాతం రిజర్వేషన్ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ,నాయకులు మదర్ ఖాన్, మహమ్మద్ రహిమోద్దీన్, మహమ్మద్ జుబేర్ ఇతరులు పాల్గొన్నారు.

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:CM KCR hypocritical love on Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *