ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష

CM KCR once again review on RTC

CM KCR once again review on RTC

Date:09/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. శుక్రవారం కూడా ఆర్టీసీపై కేసీఆర్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూలు కింద ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీని విభజించుకున్నామని, ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ అస్తిత్వంలోనే ఉందని కేసీఆర్‌కు అధికారులు వివరించారు. రోడ్డు రవాణా చట్టం-1950లోని సెక్షన్‌ 3 ప్రకారమే టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని, దీనికి ఎలాంటి ఆటంకాలూ లేవని స్పష్టం చేశారు.సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌.సుబేందర్‌సింగ్‌, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌ జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. పొరుగు రాష్ర్టాలకు ఎన్నో పథకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. దానికి సీఎస్‌ సహా ఇతర అధికారులకు వ్యక్తిగత హాజరును మినహాయించింది.

 

అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్సార్ రైతు భరోసా అమలు

 

Tags:CM KCR once again review on RTC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *