కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ తొలిసారి అపాయింట్‌మెంట్‌

హైదరాబాద్    ముచ్చట్లు:

కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కాసేపట్లో సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేతలు కలవనున్నారు. ప్రగతిభవన్‌కు సీఎల్పీ నేతలు భట్టి, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు రానున్నారు. తెలంగాణ వచ్చాక తొలిసారి కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సీఎంతో కాంగ్రెస్ నేతల భేటీ వార్తలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నేరెళ్ల ఘటన సమయంలో అపాయింట్‌మెంట్‌ కోరగా.. ఎన్నిసార్లు అసెంబ్లీలో ప్రశ్నించినా కేసీఆర్ పట్టించుకోలేదు. ఒక్కసారిగా సీఎల్పీ బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎంకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:CM KCR’s first appointment to Congress leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *