సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన..
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో పెద్దగా మార్పులు చేయబోరని, కొత్తగా ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బుధవారం నాడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండనుందని తెలుస్తోంది. కాగా, ఎస్ఎస్‌సీ కుంభకోణంలో మంత్రి పార్థఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే, అందరూ అనుకున్నట్లుగా మంత్రులందరినీ మార్చడం లేదని స్పష్టం చేసిన దీదీ.. కొత్తగా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేబినెట్‌లో మూడు ఖాళీలు ఉన్నాయన్నారు. కొత్తగా ఓ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా అటు మంత్రి పార్థ ఛటర్జీ స్థానం ఒకటి, ఖాళీలు మూడు, కొత్తగా మరొకటి మొత్తం కలిపి ఐదుగురు మంత్రులను కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.
Tags: CM Mamata Banerjee’s key announcement..

