CM pics ambition is to provide drinking water and drinking water

తాగునీరు-సారునీరు అందించడమే సీఎం జగన్‌ ఆశయం

– జగన్‌ వెహోక్కవోనిదీక్షతో చిరునవ్వే ఆయుధంగా పాలన
– రాయలసీమకు గోదావరి జలాలు ఇచ్చేందుకు కెసీఆర్‌ సుముఖత
– నాలుగు దఫాలలో పక్కాగృహాల నిర్మాణం
– ఆరునెలల్లో నవరత్నాలు అమలు
– మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

Date:16/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్సీపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికి తాగునీరు – సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. బుధవారం పుంగనూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై సోనియాగ్య్య్యాధి, మాజీ ముఖ్యమంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు కలసి కుట్రలు పన్ని 16 నెలలు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.తప్పుడు కేసులు బనాయించినా జగన్‌మోహన్‌రెడ్డి వెహోక్కవోని దీక్షతో చిరునవ్వే ఆయుధంగా ప్రజల ఆశీస్సులు పొందారని కొనియాడారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే నవరత్నాలను అమలు చేయడం జరిగిందన్నారు.

 

 

 

గృహనిర్మాణాలకు సంబంధించి ఉగాధి పండుగ రోజున పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పక్కా గృహాలను నాలుగు దఫాలలో నిర్మించి, అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పాదయాత్రలో సీఎం ఇచ్చిన హామి మేరకు కృష్ణానదికి గోదావరి జలాలను అనుసందానం చేసి, గోదావరి జలాలను హంద్రీనీవా కాలువకు తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు.ఇందులో భాగంగా గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ చర్చలు జరపడం జరిగిందన్నారు. గోదావరి జలాలను తరలించి రాయసీమలో భూమిని తడపాలని, కెసీఆర్‌ పదేపదే సూచించారన్నారు. దీని ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పదికాలాలపాటు వర్ధిల్లుతుందని తెలిపారని, ముఖ్య మంత్రి కెసీఆర్‌ నీటిని ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని పెద్దిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటికి, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఐదు లేదా ఆరు ప్రాంతాలలో రిజర్వాయర్లు నిర్మించి ఐదు టిఎంసీల నీటిని నిల్వ చేసి, రైతులకు నీటి కష్టం లేకుండ చేస్తామన్నారు.

 

 

 

 

అలాగే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరును సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందు కోసం సుమారు రూ.50 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉందన్నారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. తొలి విడతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు శ్రీకాకుళంలో ఉద్దానం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు గుంటూరులోని పల్నాడు , ప్రకాశం , కడప, చిత్తూరులో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ఈమహాత్తర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలందరు అండగా నిలిచి ర్ఖా•భివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్యంశెట్టి విశ్వనాథ్‌, వైఎస్సార్సీపి పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని బాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

19న ముస్లింలు బహిరంగ సభ

Tags: CM pics ambition is to provide drinking water and drinking water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *