కొవిడ్‌పై నేడు సీఎం జగన్ సమీక్ష

అమరావతి ముచ్చట్లు :

 

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుండి రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: CM pics review on Kovid today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *