దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్‌ నివాళి

CM pics tribute to the first President of the country

CM pics tribute to the first President of the country

Date:03/12/2019

అమరావతి ముచ్చట్లు:

భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ 135వ వర్థంతి సందర్భంగా ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సీఎం గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్‌ ప్రముఖ పాత్రను పోషించారని అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు.  ‘విభిన్న సామర్థ్యం గల సోదరులు, సోదరీమణులు అభివృద్ధి చెందడానికి సహకరిస్తాం. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలతో అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాల వైపు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. వారిలోని ఆత్మ సైర్థ్యం మనకు ఎంతో ప్రేరణ’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

 

ఏసీబీ వలలో మైనింగ్ అధికారి

 

Tags:CM pics tribute to the first President of the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *