సీఎం రమేష్ కు సొంత ఇంటి సెగ

Date:21/02/2018
కడప ముచ్చట్లు:
క‌డ‌ప‌.. అనగానే గుర్తొచ్చేది వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. వైఎస్ ఫ్యామిలీ హ‌వా అటువంటిది. ద‌శాబ్దాల నాటి ప్ర‌తిష్ఠ వైఎస్ మ‌ర‌ణంతో దూర‌మైంద‌నే వాద‌న కూడా ఉంది. కానీ.. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా.. దాన్ని నిల‌బెడ‌తారానే ఆశ పార్టీ నేత‌ల్లో ఉండేది. కానీ.. దూకుడు తత్వం.. పెద్ద‌లంటే చుల‌క‌న భావం.. అన్నీ తానే అనే అహంకారంతో అంద‌ర్నీ దూరం చేసుకున్నారంటూ.. కాంగ్రెస్ సీనియ‌ర్లు ఇప్ప‌టికీ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూనే ఉంటారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప‌లో పాగా వేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అనే భావ‌న‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతూనే ఉన్నారు. దానిలో భాగంగానే గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బాబాయిని ఓడించి.. ప‌సుపు జెండా ఎగుర‌వేశారు. వైసీపీలో కీల‌క‌మైన ఆదినారాయ‌ణ‌రెడ్డిను సైకిల్ ఎక్కించారు. ఏకంగా మంత్రి ప‌ద‌వే  క‌ట్ట‌బెట్టారు. ఆది ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం రాంసుబ్బారెడ్డి నుంచి వ్య‌తిరేక‌త పెల్లుబుకినా.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా బాబు క‌ట‌వుగానే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. అటువంటి క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గాల మ‌ధ్య నిత్యం ర‌చ్చ త‌ప్ప‌ట్లేదు. అయితే. ఇదే స‌మ‌యంలో ఎంపీ సీఎం ర‌మేష్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంపై ఆ ఇద్ద‌రు నేత‌లు ప‌లుమార్లు ర‌మేష్‌పై నిర‌స‌న వెలిబుచ్చారు. ఫ్యాక్ష‌నిజానికి కేరాఫ్ అయిన క‌డ‌ప‌లో స్వ‌ల్ప వివాదాలే.. తీవ్ర ప‌రిణామాల‌కు దారితీస్తాయ‌నే ఉద్దేశంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎవ‌ర్నీ పార్టీ నుంచి దూరం కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇటువంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలో క‌డ‌ప‌లో  జ‌రుగుతున్న గండికోట రిజ‌ర్వాయ‌ర్ అంశం రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది. రిజ‌ర్వాయ‌ర్ కింద ఇళ్లు కోల్పోతున్న వారికి పున‌రావా స చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం టెండ‌ర్లు పిలిచింది. దీనికి ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం నుంచి టెండ‌ర్లు వేశారు. ఇరువైపులా కుదిరిన ఒప్పందం మేర‌కు సిండికేట్‌గా మారిన‌ట్లు ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఈ విధంగా అయినా.. ఇరువురు నేత‌ల క‌ల‌యిక పార్టీకు మంచి ప‌రిణామ‌మే అని భావిస్తున్న వేళ‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. రంగ ప్ర‌వేశం చేశారు. టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయించి కొత్త వాటికి ఆదేశాలిచ్చారు. దీంతో మండిప‌డిన ఆది, రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు.. క‌డ‌ప‌లోని సీఎం ర‌మేష్ కార్యాల‌యం, వాహ‌నాల‌పై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. దీంతో సున్నిత‌మైన అంశం కాస్తా.. తీవ్ర‌రూపం దాల్చింది. దీనంత‌టికీ ఎంపీ ర‌మేష్ కార‌ణ‌మంటూ.. ఇరు వ‌ర్గాల నేత‌లు మండిప‌డుతున్నారు. గ‌తంలోనూ ఓ బ‌హిరంగ స‌భ‌లో సీఎం ర‌మేష్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు దాడికి దిగ‌టం అప్ప‌ట్లో క‌ల‌క‌లం సృష్టించింది.
Tags: CM Ramesh is the house of his own

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *