Natyam ad

పుంగనూరులో ఐదు మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలో ఆనారోగ్యంతో బాదపడుతున్న ఐదు మందికి సీఎం సహాయనిధి క్రింద మంజూరైన చెక్కులను బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రామనాథరెడ్డి , పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ కలసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులు తీసుకున్న వారిలో ఎ.వెంకట్రమణకు రూ.1.30 లక్షలు, టి.ప్రవీన్‌కు రూ.68 వేలు, కె.రమేష్‌బాబుకు రూ.16 వేలు, సి.శ్రీనివాసులకు రూ.60 వేలు, జె.ప్రేమ్‌కుమార్‌కు రూ.2 లక్షలు చెక్కులు అందజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాలకు సీఎం రిలీప్‌ ఫండ్‌ మంజూరు చేయించారని తెలిపారు. గత ప్రభుత్వాలు సీఎం రిలీప్‌ ఫండ్‌ సామాన్యప్రజానికానికి అందకుండపోయేదని, ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు సైతం సీఎం సహాయనిధి అందడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కోఆఫ్షన్‌మెంబరు బావాజాన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, గురివిరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: CM Relief Fund checks distributed to five people in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.