పేద‌ల‌కు వరం సీఏం సహాయ నిధి

-పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

మంథని ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదలకు ఓ వరమని  పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.  మంథని డివిజన్ పరిధిలోని రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన  చెందిన తాళ్ళపెళ్లి రమేష్  అనారోగ్యంతో బాధపడుతు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ను సంప్రదించగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయలు మంజూరు చేయించారు. సియంఆర్ఎఫ్ నిధులనుండి మంజూరైన చెక్కును రమేష్ కు శనివారం మంథనిలోని తన నివాసంలో పుట్ట మధు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి మంథని నియోజకవర్గమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క, నాయకుడు ఆరెల్లి కొమురయ్య గౌడ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags: CM Relief Fund is a boon to the poor

Leave A Reply

Your email address will not be published.