నగర వాసికి.. రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచిన ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

కడప ముచ్చట్లు:


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ప్రత్యేక చొరవతో.. నగరానికి చెందిన పద్మనాభ సోమయజుల బాల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అనారోగ్యం భారీ నుండి బయటపడనున్నారు.
వివరల్లోకెళితే.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కడప నగరం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పద్మనాభ సోమయజుల బాల సుబ్రహ్మణ్యంను వైద్యం నిమిత్తం.. చెన్నై లోని గ్లెనిగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ వైద్యశాలలో చేర్పించడం జరిగింది. అతనికి శస్త్ర చికిత్సల కోసం.. వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషను ఆశ్రయించి విషయాన్ని ఆయనకు వివరించారు. వెంటనే స్పందించిన అంజాద్ బాషా.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా.. రూ.10.లక్షలు మంజూరు చేస్తూ… సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు పత్రాన్ని మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషకు కృతజ్ఞతలు తెలుయజేశారు. ఈ సందర్బంగా ప్రజలకు ప్రమాదకరమైన ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా  పేర్కొన్నారు.

 

Tags: CM relief fund of Rs.10 lakh for city residents

Leave A Reply

Your email address will not be published.