పవన్, చంద్రబాబు విమర్శలపై స్పందించిన సీఎం

CM responded to criticism of Pawan and Chandrababu

CM responded to criticism of Pawan and Chandrababu

పవన్ పిల్లలు తెలుగు మీడియం చదువుతున్నారా

Date:11/11/2019

విజయవాడ ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై పవన్, చంద్రబాబు సహా విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింనందుకు విమర్శలు చేస్తున్న వారంతా వాళ్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు జగన్.‘చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా.. ముగ్గురు పెళ్ళాలు , నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు’అంటూ సీఎం ప్రశ్నించారు.ప్రపంచ స్థాయి కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియామ్ ప్రవేశపెట్టడము ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అంటూ మండిపడ్డారు. మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకు.. ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఒకసారి ఆలోచన చేయాలి అన్నారు.

 

మగపిల్లాడి కోసం బాలికతో పెళ్లి

 

Tags:CM responded to criticism of Pawan and Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *