Natyam ad

కోవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష

అమరావతి ముచ్చట్లు:
 
వైద్య ఆరోగ్య శాఖపై  ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు. కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కోవిడ్లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమేరకు హోం కిట్లో మార్పులు చేయాలి. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలి. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని  సీఎం సూచించారు. అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని  ముఖ్యమంత్రి సూచించారు. 104 కాల్ సెంటర్ను బలంగా ఉంచాలి. ఎవరు కాల్చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేయాలి. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్లు కచ్చితంగా ధరించేలా చూడాలి. మాస్క్లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలి. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలి. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలి. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్డోర్స్లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశం, మాస్క్తప్పనిసరి చేయాలని ఆదేశం. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని ఆదేశించారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: CM review on Kovid conditions

Leave A Reply

Your email address will not be published.