CM review on response program

స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష

Date:20/10/2020

అమరావతి ముచ్చట్లు

 

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైయస్  జగన్ స్పందన కార్యక్రమం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత,  సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. మొత్తం ఏడు  ప్రధాన అంశాలపై  సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాలు, కోవిడ్, ఎన్ఆర్ఈజిఎస్, నాడు నేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్స్ తనిఖీలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ వర్షాలకు సంబంధించి కలెక్టర్లుతో ప్రత్యేకంగా ఈ నెల 14న  సమీక్ష నిర్వహించాం. వర్షాలు గడిచిన పదిరోజులగా విపరీతంగా కురుస్తున్నాయి. కలెక్టర్లు మానవతా ధృక్ఫదంతో ఉండాలి. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. .వారికి వెంటనే సాయం చేయండి. దీనిమీద వెంటనే చర్యలు తీసుకొండి.  చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వెంటనే, త్వరితగతిన ఇవ్వండి.  కలెక్టర్లు దగ్గరుండి చూసుకొండి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరూ 31 అక్టోబరులోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయండని అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31 లోగా పూర్తి చేయండి.  వెంటనే రోడ్ల మరమ్మత్తులు మొదలుపెట్టండి ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లపై ధ్యాస పెట్టండని అన్నారు. కరెంటు పునరుద్ధరణ కలెక్టర్లు వేగంగా చేశారు. కలెక్టర్లందరికీ అభినందనలు.  కలెక్టర్లకు, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. ఈనెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు.

 

తక్షణ సహాయం అందిస్తున్నాం

Tags:CM review on response program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *