సీఎం తిరుపతి జిల్లా పర్యటన రద్దు
సూళ్లూరుపేట ముచ్చట్లు:
భారీ వర్షం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లా పర్యటన రద్దు అయింది. మంగళవారం నాడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మాంబట్టు వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ రోజు బహిరంగ సభలో పాల్గొని ఈ ప్రాంత మత్యకారుల అభివృద్ధి కోసం సుమారు 150 కోట్ల రూపాయలు తో కొన్ని ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వుంది. అయితే, రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా అధికారులు ముఖ్యమంత్రి పర్యటన రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

Tags: CM Tirupati district visit cancelled
