చిన్నారి హనీని ఆశీర్వదించిన సీఎం వైయస్.జగన్
తాడేపల్లి ముచ్చట్లు :
క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను కలిసిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను కలిసిన చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు.అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే రూ.1 కోటి మంజూరు చేసిన సీఎం.చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా అందిస్తున్న ప్రభుత్వం.ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీ.ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైయస్.జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు.

Tags: CM YS Jagan blessed baby Honey
