కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సీఎం వైయస్.జగన్ భేటీ
అమరావతి ముచ్చట్లు:
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం: సీఎంభరత్‌ను గెలిపిస్తే.మంత్రి పదవి : సీఎం
చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగింది:
కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం:
కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాను .175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలి: సీఎం వైయస్.జగన్.కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమావేశం.ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం: సీఎం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుగారికి మద్దతుగానే ఉందని అని బయట ప్రపంచం అంతా అనుకుంటారు .వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం:
బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి:
బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం:
దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు:
అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం:
చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను:
ఆరోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు:
నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆరోజే చెప్పాను:
ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం:
మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు:
దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు:
భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది:
భరత్‌ను గెలుపించుకు రండి :
భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను.

నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు:
నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది.స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్లపట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు.మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి.నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి.ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌కూడా అమల్లోకి వస్తుంది:
సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధికన్నా.. ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది:
రాబోయే రోజుల్లో మరింత జరుగుతుంది.వచ్చే రెండురోజుల్లో కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నాం:
భరత్ అడిగాడు, జగన్‌గా నేను చేయిస్తున్నాను:
కుప్పం బ్రాంచ్ కెనాల్ పని జరుగుతూ ఉంది:
సంవత్సరంలోపు దాన్ని పూర్తిచేస్తాం.
కుప్పం నియోజకవర్గాన్ని నా నియోజకవర్గంగానే చూస్తాను:
అన్నిరకాలుగా మద్దతు ఇస్తాను:
గతంలో కుప్పం గెలుస్తామా? అంటే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని అద్భుతాలు జరిగాయి:
పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయాలు నమోదుచేశాం:
ఇవాళ ఇంత మంచిచేస్తున్న ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది:
గడపగడపకూ కార్యక్రమంఇవాళ జరుగుతోంది:
పథకాలన్నీ అందాయా? అని అడుగుతున్నాం:
అందాయని ప్రజలు చెప్తున్నారు:
రాజకీయాల్లో మనం ఉన్నందుకు సంతోషం కలుగుతుంది:
రాజకీయనాయకుడిగా మనకు ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే.. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు, వారు మనల్ని దీవిస్తున్నప్పుడు వస్తుంది:
ఇవాళ కాలర్ ఎగరేసుకుని… మనం గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం:
ఈ ఆశీస్సులు ఇస్తున్న ప్రజల మద్దతు తీసుకునే బాధ్యత మీది:
175కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పంనుంచే ప్రారంభం కావాలి:
మీ భుజస్కంధాలమీద ఈ బాధ్యతను పెడుతున్నాను:
మీ మీద ఆ నమ్మకం నాకు ఉంది:
రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి:
కార్యకర్తలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తాం : సీఎం వైయస్.జగన్.
Tags: CM YS Jagan met party workers of Kuppam constituency
