Natyam ad

గృహనిర్మాణంపై సీఎం  వైయస్.జగన్ సమీక్ష

అమరావతి ముచ్చట్లు:


గృహనిర్మాణంపై సీఎం  వైయస్.జగన్  మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు మాట్లడుతూ గృహనిర్మాణంలో పురోగతిని వివరించారు. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకుసాగుతాయని అన్నారు. ఈ ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామన్నారు. విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేకదృష్టిపెడుతున్నాం. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని వివరించారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాం.

 

డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడించారు. మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామన్నారు. ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సీఎంఆదేశల మేరకు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. యి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన,మార్గదర్శకాలు సూచిస్తున్నామని అన్నారు.సీఎం మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలి. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుంది.  ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై అసోసియేషన్లకుబాసటగా నిలవాలని అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్,  ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి విసత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇతరఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: CM YS Jagan’s review on housing

Post Midle

Leave A Reply

Your email address will not be published.