కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్ మార్గదర్శకాలు

Awakars and Chevaks aside: CM

Awakars and Chevaks aside: CM

Date:02/12/2019

అమరావతి ముచ్చట్లు:

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా క్షేత్రస్థాయి పర్యటనలతోనే సరైన ఫీడ్‌ బ్యాక్‌ వస్తుంది  ప్రజలు, లబ్ధిదారులు, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకం  ఆకస్మిక తనిఖీలు చేయండి రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయండి దీని వల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగు పడతాయి కొంత మంది జిల్లా కలెక్టర్లు పెద్దగా క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లడం లేదని నా దృష్టికి వచ్చింది : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పరిస్థితి వెంటనే మారాలి ఈ పరిపాలనలో జిల్లా కలెక్టర్లే నా కళ్లు, చెవులు ప్రజలు, ప్రభుత్వానికి వారు వారధి వంటి వారు జిల్లా కలెక్టర్లకు సీఎం వైయస్‌.జగన్‌ మార్గదర్శకాలు. కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని, నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, క్షేత్రస్థాయి పర్యటనల వల్లనే సరైన ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందన్నారు. దీనివలన ప్రజలు, లబ్ధిదారులు, తదితర వర్గాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకం అని స్పష్టం చేశారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల క్షేత్రస్థాయి పర్యటనలు మెరుగు పడతాయన్నారు. కొంత మంది జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి పెద్దగా వెళ్లడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం, ఈ పరిస్థితి మారాలన్నారు. పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తనకు కళ్లు, చెవులు వంటి వారని, ప్రజలు, ప్రభుత్వానికి కలెక్టర్లు ఒక వారధిలా ఉండాలన్నారు. కలెక్టర్లకు మార్గదర్శకాలు. కలెక్టర్లు వెంటనే వీడియా కాన్ఫరెన్సులు తగ్గించి, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి. నెలలో కనీసం 15 రోజుల పాటు జిల్లాలో పర్యటించాలి. పథకాల అమలుకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు పొందడం కంటే, నేరుగా లబ్ధిదారులతో మాట్లాడితే సరైన ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. ప్రజలు, లబ్ధిదారులు ఇచ్చే సమాచారం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం. మండల స్థాయి అధికారులతో ఇక నుంచి వారానికి రెండు సార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి. మంగళవారం ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఒకసారి, వారంలో రెండో దఫా మరో సారి మాత్రమే కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి. వారానికి ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల హాస్టళ్లు లేదా ఆస్పత్రుల్లో నిద్ర చేయాలన్న సూచనను కొందరు కలెక్టర్లు అమలు చేయడం లేదని నా దృష్టికి వచ్చింది. వెంటనే ఈ పద్ధతి మారాలి. ప్రతి కలెక్టర్‌ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల హాస్టల్స్ లేదా ఆస్పత్రిలో ఎక్కడో ఒక చోట నిద్ర చేయాలి.

 

విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి కె.వెట్రిసిల్వి నియామకం

 

Tags:CM YS pics guides for collectors

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *