నిరుపేదలకు వరం సిఎం.అర్.ఎఫ్ పథకం
-2,50,000/-రూపాయల ఎల్వోసిని అందచేసిన ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన .రాముడు తండ్రి చిన్న కిస్టన్న మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,వారి పరిస్థితిని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి కి వివరించగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన వైద్యం కోసం సీఎం ఆర్ ఎఫ్ పథకం కింద రూ.2,50,000/-* రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు 2,50,000/- రూపాయల ఎల్వోసిని అందచేశారు.సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.తమ వినతిని మన్నించి రూ.2,50,000/- ల ఎల్వొసిని మంజూరు చేయించినందుకు సిఎం.కేసీఅర్ , ఎమ్మెల్యే కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన రాముడు కుటుంబ సభ్యులు.
Tags: CMRF scheme is a boon to the poor
