సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యపేట ముచ్చట్లు:


అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 138 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన  45 లక్షల 43 వెయ్యిల రూపాయల చెక్కులను అందజేశారు.ఈసందర్భంగా  మాట్లాడుతూ,పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది  అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని తెలిపారు .మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు.

 

 

వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి  అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శం .రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది  అన్నారు.అభివృద్ధి లో, సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని,రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్,రైతు భీమా.రైతు బంధు పథకాలు,మిషన్ భగీరథ,కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అయిందని  తెలిపారు.పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అని  గుర్తు చేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వంతో గ్రామాల రూపు రేఖలు మరాయి అన్నారు.ప్రజల్లో ఒక నమ్మకాన్ని ,భరిసాను ఈ ప్రభుత్వం నింపిందని అన్నారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం  అన్నారు.

 

 

 

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్  ఆపద్బాంధవుడు అన్నారు.ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం  బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి  కింద చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి, జడ్పీటీసీ కృష్ణ కుమారి శేషు,పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్, పట్టణ కౌన్సిలర్లు సామినేని ప్రమీల, కందుల  చంద్రశేఖర్,గుండెల సూర్యనారాయణ, ఖదీర్, షేఫీ, , మైస రమేష్, ఖాజా, బెజవాడ శ్రవణ్, ఒంటిపులి శ్రీనివాస్, చింతల నాగేశ్వరావు, సాదిక్,మామిడి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, పోటు రంగారావు,  టిఆర్ఎస్ నాయకులు, గంధం పాండు, బత్తుల ఉపేందర్, వంశీ,గంట శ్రీనివాసరావు,కనగాల శ్రీధర్,కోదాటి కృష్ణయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు,పార్టీ నాయకులు,  టిఆర్ఎస్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

 

Tags; CM’s relief fund should be utilized – MLA Bollam Mallaiah Yadav

Leave A Reply

Your email address will not be published.