Natyam ad

సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

కర్ణాటక ముచ్చట్లు:

 

తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. తాజాగా ఈ స్టార్ నటుడు కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. తారక్​ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.  తెలుగులో అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతూ అశేష అభిమానుల మనసులను గెలుచుకున్నారు.  తారక్​.. కన్నడలోనూ జనాదరణ పొందారు.  తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  దీంతో తారక్​ కర్ణాటక ప్రయాణంపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్​ వెళ్లనున్నారు.  ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్​ రాజ్​కుమార్​కు కర్ణాటక అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం తారక్​ను ఆహ్వానించింది.  ఈ కార్యక్రమానికి రావడానికి తారక్​ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు.  అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్​ను సైతం ఆహ్వానించామని చెప్పారు.  కన్నడ ప్రజల్లో పునీత్​కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు.

 

 

Post Midle

ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్​ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్​ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్​ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.  కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్​ రాజ్​కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు.  ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు పునీత్.

 

Tags: CM’s special invitation.. Junior NTR to go to the Assembly

Post Midle

Leave A Reply

Your email address will not be published.