కూల్చివేతలకు సహకరించాలి:మంత్రి సత్యవతి రాధోడ్

మహబూబాబాద్  ముచ్చట్లు:
గురువారం నాడు 4వ దశ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, 7వ దశ హరితహారం ప్రారంభమైన సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ కు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్  స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్ గోపి రత్నం, కలెక్టర్ విపి గౌతం, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ అగస్త్య, ఇతర అధికారులు, నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ లోని మంచి ప్రాంతంలో సమీకృత మార్కెట్ కు నేడు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది.  మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారింది. దీన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాల్సిన కర్తవ్యం మన ముందు ఉంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరు అయింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, డాక్టర్లు వస్తారు. డివిజన్ కేంద్రం నుంచి మానుకోట  జిల్లా కేంద్రం అయినపుడు అందుకనుగుణంగా అభివృద్ధి అయ్యేందుకు అనేక మార్పులు వస్తాయి. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. మనం పుట్టకముందే మానుకోటకు మాస్టర్ ప్లాన్ ఉంది. కానీ మాస్టర్ ప్లాన్ అమలు చేయడంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు అంత అవసరం లేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ ఉన్నా రోడ్ల మీద కొంత ముందుకు జరిగాము. ఇప్పుడు అవసరం ఉన్నది కాబట్టి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరిని నొప్పించాలని, నష్ట పర్చాలనే ఉద్దేశ్యం లేదు. దయచేసి అందరూ అర్దం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు అద్భుతమైన మార్కెట్ కోసం మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలాంటి మార్కెట్ ఇక్కడ వస్తుందని మనం ఏనాడు కనీసం ఊహించలేదు. కోర్టు నుంచి ఇక్కడి వరకు అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Co-operate in demolition: Minister Satyavati Radhod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *