Natyam ad

బద్వేల్ లో చెలరేగుతున్న బొగ్గు మాఫియా

అనుమతులు లేకుండానే అక్రమంగా బొగ్గు రవాణా

బొగ్గుతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణా

బద్వేలు ముచ్చట్లు:

బద్వేల్ కేంద్రంగా బొగ్గు మాఫియా గత కొంతకాలంగా చెలరేగిపోతుంది ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రతిరోజు టన్నులకొద్ది బొగ్గు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు ఇది చాలాకాలంగా నడుస్తుంది అడిగేవారు లేకపోవడంతో వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది బొగ్గు అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ ప్రతిరోజు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం బద్వేల్ నియోజకవర్గం లో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాల చుట్టూ విస్తారంగా అడవులు ఉన్నాయి ప్రధానంగా లంకమల్ల అభయారణ్యం బద్వేల్ కు అత్యంత సమీపంలో ఉంది బొగ్గు రవాణాకు కేవలం ఐదు మందికి మాత్రమే అటవీ అధికారులు అనుమతులు ఇచ్చారు వీరిలో కొందరు సబ్ ఏజెంట్లు నియమించుకొని వారి ద్వారా టన్నుల కొద్ది బొగ్గు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న తుమ్మ చెట్లను నరికి వాటిని బొగ్గుగా మార్చి తరలిస్తున్నారు అలాగే అడవుల్లో ఎంతో విలువైన అయినా భారీ చెట్లను నరికించి వాటిని బొగ్గుగా మారుస్తున్నారు

 

 

 

Post Midle

అనుమతులు ఒకచోట అయితే మరోచోట చెట్ల నరికి వాటిని బొగ్గుగా మార్చడం ఎంతోకాలంగా జరుగుతుంది అట్టివ అధికారులకు సిబ్బందికి ఈ విషయం తెలిసి కూడా తెలియనట్లు ఉండడం ఆరోపణలకు కారణం అవుతుంది అనుమతులు అడ్డుపెట్టుకొని కూలీలను అడవుల్లోకి తీసుకువెళ్లి చెట్లను నరికిస్తున్నారు ఇప్పటికే అడవుల్లో ఎంతో విలువైన చెట్లు వీరి అత్యాశకు బలైపోయాయి ముఖ్య విషయం ఏమిటంటే ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లు కూడా కూలీల చేత నరికించి ఎంతో రహస్యంగా బొగ్గు బస్తాల కింద పెట్టి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం  బొగ్గు కంటే ఎర్రచందనం ఎంతో విలువైనది కావడంతో వీరి దృష్టి ఎర్రచందనం చెట్లపై పడింది ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం చెట్లు లంక మల్ల అభయారణంలో ఉన్నాయి ఎకరాల కొద్ది ఎర్రచందనం చెట్లు లంక మల్ల అభయారణ్యంలో ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బొగ్గు అనుమతుల అనుమతుల కాంట్రాక్టు పొందిన వారు తమ ఏజెంట్లు కూలీల ద్వారా ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని చిన్న చిన్న దుంగలుగా చేసి వాటిని అడవిలోనే ఒక రహస్య ప్రాంతంలో దాచి ఉంచుతారు బొగ్గు రవాణా కోసం బద్వేల్ లో లారీలు మాట్లాడుకొని వాటిని అడవిలోకి తీసుకువెళ్లి బొగ్గు బస్తాలు ఎక్కించక ముందే ఎర్రచందనం దుంగల్తో సగం పైగా నింపుతారు ఆ తరువాత వాటిపై బొగ్గు ఉన్న బస్తాలు వేస్తారు చూసేవారికి బొగ్గు రవాణా అవుతున్నట్లు కనిపిస్తుంది లారీ వారు

 

 

 

అనుకున్న చోటికి చేరితే అన్ని ఖర్చులు పోను లక్షల్లో మిగులుతుంది ఇలా ప్రతినెల 20 లారీల వరకు రవాణా జరుగుతూ ఉంటుంది ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే గతంలో ఒకసారి బద్వేల్ మీదుగా ఐదు బొగ్గు లారీలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండడంతో ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసి కాపు కాసి పట్టుకున్నారు వాటిని ఒక ప్రాంతంలో దాచి ఉంచిభేరసారాలు కుదిరిన తర్వాత లక్షల రూపాయలు దండుకొని వాటిని వదిలిపెట్టారు అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఆ తరువాత ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికి రావడంతో చర్యలు తీసుకున్నారు కానీ జరగ వలచిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఇప్పటికీ అలాంటి తంతు జరుగుతూనే ఉంది గతంలో గతంలో అనేక ఇబ్బందులు పడేవారు బొగ్గు అక్రమ రవాణా ఎర్రచందనం తరలించడం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు కోటానుకోట్లకు పడగ లెత్తారు ఇది అందరికీ తెలిసిన సత్యమే వారు ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీరి అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

 

Tags: Coal mafia raging in Badwel

Post Midle

Leave A Reply

Your email address will not be published.