కోడ్ ఉల్లంఘన…రెండు కేసులు నమోదు

Code Violation ... Two cases are registered

Code Violation ... Two cases are registered

Date:09/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ఈనెల  12 న  రాష్ట్ర డీజీపీ, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. స్టాటిక్ టీమ్ లను రాష్ట్ర వ్యాప్తంగా నియమిస్తాం. డబ్బు పంపిణీ, మద్యం సరఫరా పై ఈ స్టాటిక్ టీం లు నిరంతరం పనిచేస్తాయని అయన అన్నారు. ఎన్నికల నియమావళి కింద రెండు కేస్ లు బుక్ చేశాం. క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వద్దు అని సూచించాం. రాష్ట్ర సరిహద్తుల్లో  సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేస్తామని అయన అన్నారు.
చెక్ పోస్ట్ లు కాకుండా మొబైల్ టీం లు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా భారి ఎత్తున నగదు తీసుకువెళ్తున్న సీజ్ చేస్తాం. వాటికి అనుగుణంగా పత్రాలు చూపిస్తే నగదు ఇచ్చేస్తామని అయన అన్నారు. ప్రచారం సందర్భంగా పబ్లిక్ కి ఇబ్బందులు కలిగించవద్దు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దు. హోర్డింగ్ ,బ్యానర్లు ,ప్రభుత్వ ఆఫీస్ లలో క్యాలెండర్లు తొలగించామని రజత్ కుమార్ వెల్లడించారు. కొన్ని పార్టీల పిర్యాదు మేరకు పెట్రోల్ బంక్ లో ఉన్న ప్రధాని ఫొటో ను కూడా తొలగించాం. బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.  నిబంధనలు లోబడి ఏ కార్యక్రమమైన నిర్వహించుకోవచ్చని అయన అన్నారు.
Tags:Code Violation … Two cases are registered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *