Natyam ad

“ఓ బ్లాక్” లో కాఫీ షాప్ ఏర్పాటు

కడప ముచ్చట్లు:
 
కొత్త కలెక్టరేట్ సముదాయంలో ఉన్న” ఓ బ్లాక్” ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ షాప్ ను సోమవారం జేసి (రెవెన్యూ) గౌతమి ప్రారంభించారు.ఈ సందర్భంగా జేసి (రెవెన్యూ)  మాట్లాడుతూ.. ఉద్యోగులు, సిబ్బంది తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేయకుండా తమ ఆవరణలోనే ఏర్పాటు చేసిన కాఫీ షాప్ నుండి కార్యాలయానికే కాఫీ /టీ తెప్పించుకుని తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు.  అందరికి అనుకూలంగా ఇక్కడ కాఫీ షాప్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ అవకాశాన్ని కలెక్టరేట్ లో ఉన్న ఉద్యోగులందరు వినియోగించుకోవాలని జేసి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏపిఎంఐపి పీడి మధుసూదన్ రెడ్డి, మైన్స్ డిడి వెంకటేశ్వర రెడ్డి , ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు, సమాచార శాఖ ఏడి వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Coffee shop set up in “O Block”