Natyam ad

చింతపండు వ్యాపారుల కోసం శీతల గిడ్డంగులు అవసరం – మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

చింతపండు వ్యాపారాలకు ప్రసిద్ది గాంచిన పుంగనూరులో శీతలగిడ్డంగులు నిర్మించడం ఎంతో అవసరమని , వ్యాపారులకు సహకారం అందిస్తున్న కోల్డ్ స్టోరేజ్‌ యాజమాన్యాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. గురువారం చిత్తూరు రోడ్డులో ఎస్‌ఎస్‌బి కోల్డ్ స్టోరేజ్‌ను మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ రెడ్డెప్పతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చింతపండు వ్యాపారులు గత ప్రభుత్వంలో ట్యాక్స్లు చెల్లించలేక వీధినపడ్డారన్నారు. చింతపండు వ్యాపారుల ఆవేదనను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకుండ ,కమర్షియల్‌ ట్యాక్స్ అధికారులచే దాడులు చేయించడం, కేసులు పెట్టడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చింతపండు వ్యాపారుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకునేందుకు చింతపండుకు ట్యాక్స్లు లేకుండ చేయాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ విషయాన్ని సీఎం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరపున కేంద్రానికి నివేదికలు పంపారన్నారు. దీనిపై ఎంపీ మిధున్‌రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో పలుమార్లు చింతపండు ట్యాక్స్ విషయమై చర్చలు జరిపారని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చింతపండుకు ట్యాక్స్లు లేకుండ ఉత్తర్వులు జారీ చేసిందని,

 

 

 

Post Midle

ఎంపీ మిధున్‌రెడ్డి కృషితో చింతపండు వ్యాపారులకు విముక్తి లభించిందన్నారు. చింతపండు తయారిపై సుమారు 20 వేల మంది ఆధారపడి, కుటుంబ పరిశ్రమగా ఏర్పాటైందని మంత్రి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడంతో చింతపండు వ్యాపారులకు ట్యాక్స్ల మినహాయింపు, కమర్షియల్‌ ట్యాక్స్ అధికారుల వేదింపులు తప్పి వ్యాపారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. చింతపండు వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే శీతల గిడ్డంగులు , గోదాములు నిర్మించేందుకు ముందుకు వస్తే వారికి ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్‌ యజమానులు డాక్టర్‌ శరణ్‌, హరిప్రసాద్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags: Cold storage required for tamarind traders – Minister Peddireddy

Post Midle