ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు సహకరించండి

Collaborate on banning plastic altogether

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్‌ వస్తువుల క్రయవిక్రయాలను, వినియోగాలను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు వ్యాపారులు , ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో వ్యర్థక వ్యాపారులు, పండ్ల వ్యాపారులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, సబ్‌ కలెక్టర్‌ కీర్తి సన్నహాలు చేస్తున్నారని తెలిపారు. ఇది శుభపరిణమమన్నారు. జిల్లా స్థాయిలో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించే కార్యక్రమం చేపట్టడం , ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల క్రితమే పుంగనూరు మున్సిపాలిటిలో ప్రారంభించడం హర్షనీయమన్నారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ , పర్యావరణ కాలుష్యా నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్లాస్టిక్‌ వస్తువులు ఏ విధంగానైనా వినియోగిస్తే ఆ కవర్లను రోడ్లపై పడవేయకుండ తమ తమ ఇండ్లలో, దుకాణాలలో వేరుగా భద్ర పరచాలన్నారు. దీనిని మున్సిపల్‌ కార్మికుల ద్వారా స్వీకరించి, రీసైక్లింగ్‌ విధానాన్ని చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణంలో ఎక్కడ కానీ ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు లేకుండ చేయడమే ప్రధమ కర్తవ్యంగా మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు పనిచేయడం జరుగుతుందన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు, వినియోగం చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, పట్టణ చాంబర్‌ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌, వర్థక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, సంకల్ప సోసైటి సభ్యులు రాజా, జానకి, సుజాత, సురేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ

Tags: Collaborate on banning plastic altogether

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *