కుప్పకూలిన పురాతన వంతెన
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం గొల్లారు గ్రామసమీపంలో నలభై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన కొద్ది రోజుల క్రితం కూలిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు అంతరాయం ఏర్పడింది. రాంపురం, గొల్లూరు తదితర పరిసర గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు. ఈ మేరకు వంతెన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. అయితే హామీలు కు మాత్రమే పరిమితమై ప్రజా ప్రతినిధిలు, ఆధికారులు నిర్మాణానికి నోచుకోలేదు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యని పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Tags; Collapsed ancient bridge

