కుప్పకూలిన బ్రిడ్జి.. తప్పిన ప్రాణాపాయం
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిపై ఉన్న బ్రిడ్జి ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా విరిగి పడింది. 1929 లో దీనిని నిర్మించారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ళ లారీ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపైన వెళ్తున్న వాహనాలు క్రింద పడిపోయాయి. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అయితే వంతెన కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Tags: Collapsed bridge.. Missed lives

