Collector appreciates municipality

మున్సిపాలిటికి కలెక్టర్‌ ప్రశంసలు

Date:22/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి రాష్ట్ర పోటీలలో అగ్రస్థానంలో నిలిచి నెంబరు -1 స్థానాన్ని కైవసం చేసుకోవడంపై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ప్రశంసించారు. కలెక్టర్‌ను కమిషనర్‌ కెఎల్‌.వర్మ తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పుంగనూరు భవిష్యత్తులో కూడ ఇలాగే అగ్రస్థానంలో నిలిచేలా అందరు కృషి చేయాలని కోరారు. మున్సిపల్‌ ఉద్యోగులకు, కార్మికులకు , పట్టణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు

మున్సిపాలిటిలో సంబరాలు ….

పుంగనూరు మున్సిపాలిటి పారిశుద్ధ్యమాసోత్సవాలలో రాష్ట్రంలోని 59 మున్సిపాలిటిలలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉద్యోగులు కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌తో పాటు కార్మికులకు కమిషన్‌ శాలువలు కప్పి,పూలమాలలు వేసి సన్మానించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించి , రాష్ట్రంలో అగ్రస్థానం సాధించేందుకు కార్మికుల కృషి మరువలేనిదని కమినషర్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆర్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌గా సుధాకర్‌రెడ్డి

Tags: Collector appreciates municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *