జీన్స్ ప్యాంట్‌పై కలెక్టర్‌ భరత్‌ కన్నెర్ర

Date:02/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు సాధారణ దుస్తుల్లో విధులకు హాజరుకావాలని , జీన్స్ ప్యాంట్, టీషర్టులు ధరిస్తే సస్పెండ్‌ చేస్తానని జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా సచివాలయ కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఆయన ట్రైని కలెక్టర్‌ విష్ణుతేజ, కమిషనర్‌ కెఎల్‌.వర్మతో కలసి పట్టణంలోని ఈస్ట్పేట సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు జీన్స్ ప్యాంట్, టీషర్టులు వేసుకోవడంపై మండిపడ్డారు. తొలిసారి కాబట్టి వదిలివేస్తున్నా…. ఈ సారి ఉద్యోగులు ఇలాంటి డ్రస్సులు వేస్తే సస్పెండ్‌ చేస్తా జాగ్రత్త…. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు డ్రస్సులు , ఐడి కార్డులు ధరించి, ప్రజలతో సావదానంగా మాట్లాడి, సమస్యలు పరిష్కరించాలని , క్రమశిక్షణ లోపిస్తే చిత్తూరుకు తిరగాల్సి వస్తుంది…జాగ్రత్త అంటు హెచ్చరించారు. ఈ సంఘటనతో పట్టణంలోని 16 సచివాలయాలలోని ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడ వెళ్లి సాధారణ దుస్తులు ధరించేశారు.

అధిక వడ్డీల పేరుతో మోసం

Tags: Collector Bharat Connerra on jeans pants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *